![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1016 లో.. వసుధార, మను ఇద్దరు కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి బయటకు వెళ్ళినప్పుడు.. ఇద్దరున్న ఫోటోని రాజీవ్ చూస్తూ.... నా మరదలు నా సొంతం.. వాడు నీకు హెల్ప్ చేస్తున్నాడు.. అక్కడ వరకు ఒకే గానీ ఇలా ఉంటే నాకు నచ్చదు. అసలు లేని రిషిని ఎక్కడ నుండి తీసుకొని వస్తావ్.. నిన్ను ప్రాణం గా ప్రేమించే నన్ను వదిలిపెట్టి రిషి అంటూ తిరుగుతున్నావని రాజీవ్ అనుకుంటాడు. ఆ మను గాడి చాప్టర్ క్లోజ్ చేస్తానని రాజీవ్ అనుకుంటాడు.
ఆ తర్వాత రిషి ఫోటోని వసుధార చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఈ రోజు మనం కలిసి వెళ్లిన చోటుకి వెళ్ళను సర్ అన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని వసుధార చెప్పుకుంటుంది.. మను గారు మన ప్రేమ గ్రేట్ అంటున్నారు.. తను అర్థం చేసుకున్నారంటూ మాట్లాడుకుంటుంది. మిమ్మల్ని తీసుకొని వస్తాను. అందరి నోర్లు మూయిస్తాను.. ఇక మనం ఒకటి అయ్యే సమయం దగ్గర పడిందని వసుధార అనుకుంటుంది. మనుని అనుపమ గారిని చూసినప్పుడల్లా.. మిమ్మల్ని, జగతి మేడమ్ నే చూసినట్టు అనిపిస్తుంది.. మీపై ప్రేమ జగతి మేడమ్ కళ్ళలో ఎలా కన్పించేదో ఇప్పుడు అనుపమ గారి కళ్ళల్లో మను గారిపై ప్రేమ కనిపిస్తుంది. అసలు వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను సర్ అని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత మను భోజనం చేస్తుంటాడు. అప్పుడే పోలమారుతుంది. అక్కడే ఉన్న అమ్మమ్మ.. ఏంటి మొన్న మహేంద్ర వాళ్ళింటికి వెళ్తే ఇలాగే అయితే ఎవరో గుర్తుకు చేసుకున్నారని మహేంద్ర అంటే నాకు ఎవరు లేరని అన్నావట అని అంటుంది. అలా పెద్దావిడ అనగానే అప్పుడే విషయం నీ వరకు వచ్చిందా అని మను అంటాడు. అయిన నాకు ఆవిడ సమాధానం చెప్పేవరకు నా జీవితం ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుందని మను అంటాడు.
మరొకవైపు అనుపమ దగ్గరకి మహేంద్ర వచ్చి.. మను గురించి అడుగుతాడు. అనుపమ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. మరొకవైపు మను, వసుధరాల ఫోటోని శైలంద్రకి రాజీవ్ చూపించి.. ఈ ఫోటోలని కాలేజీ మొత్తం అంటిస్తానని రాజీవ్ అనగానే ఐడియా బాగుందని శైలేంద్ర అంటాడు. అదేసమయంలో ఏంజిల్ ని వసుధార పిలిచి.. మను బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా అని అడుగుతుంది. లేదని ఏంజిల్ చెప్తుంది. అప్పుడే మను వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |